Monday, 3 December 2007
మాంచెష్టర్ అనుభవము
కం.
మాంచెష్టరునగరమ్మున
మంచుయు వర్షము కురియని మంచి దినంబున్
కాంచెదమనెడిన్ నొకపరి
వాంఛయునెప్పటికితీరు బ్లాగేశ్వరుకున్
గురువులకు నమస్సులు
హృద్యముగ శిశు పరీక్షా
విద్యను వైవిధ్య రీతి వివరించితిరే
ఉద్యోగము చూపితిరే
పద్యముతోగురువరేణ్య!ప్రణితములివిగో
Sunday, 2 December 2007
నమః శివాయ
గంగ జలము చేత గంధము మందార
మున్నగు బహు పుష్పములతొ పూజ
లందు కొనెడి నంది ప్రమథనాధేశ్వర
వందనము మ కార మంత్ర రూప
Sunday, 25 November 2007
నమః శివాయ
పన్నగాభరణుడు ఫాలాక్షునకు విబూ
దలదుకొన్న శివకి నభము వస్త్ర
ముగగలపరిశుద్ధ పూర్ణ స్వరూపికి
వందనము న కార మంత్రరూప
Friday, 23 November 2007
Thursday, 15 November 2007
నాగుల చవితి
హరునకు కంఠాభరణము
హరికిని వైకుంఠమున శయన పానుపు ఇ
ద్దరికిని బాంధవ్యముగల
సరీసృపమ్ములకు మానసార్చన చేసెన్
Thursday, 8 November 2007
పద్యాలు వ్రాయవద్దంటే
అందుకు నాస్పందన
కందములు రాయ వలదన
గాదురదగల కరము నిలకడగ నిలుచునే
ఛందము నేర్చిన వాడిని
బందము చేసిననునతడు పద్యము విడునే
Monday, 22 October 2007
పదములు మూడిచ్చి కంద పద్యమ్మడిగెన్!
పదములతొ పెండ్లి చేసెను
పదములు పూరణకు కొఱెను పదరున శ్రీరాం
పదములివిగొనని రాముడు
పదములు మూడిచ్చి కంద పద్యమ్మడిగెన్!
ఈ టపా పూర్వాపరాలు తెలియాలంటే ఒకసారి శ్రీరాం గారి సంగతులు సందర్భాలు చదవాల్సిందే..
ఊకదంపుడు గారి సూచనతో
పదములతొ పెండ్లి చేసెను
పదములు పూరింపగోరె పదరున శ్రీరాం
పదములు గొనుడని రాముడు
పదములు మూడిచ్చి కంద పద్యమ్మడిగెన్!
Saturday, 20 October 2007
నకళ్ళతయారీదారులు
అడదడి చిత్రము కన వడి
వడి వెలువడె వివరము విడువ తెలివిడె కథన్
తొడితొడిన ఆంగ్ల లిపియును
తొడుగై రాగా ఘటనలు తొడరును ఇట్లా
Sunday, 14 October 2007
మారీచుడు కర్ణుడు రాముడు శ్రీరాముడు
కంద గడ్డ కత్తిపీట కి దురద పుట్టిస్తుందో లేదో తెలియదుకాని నాకు మాత్రము కందం పేరు చెబితే బాగా పద్యం వ్రాయాలని దురద పుడుతోంది, ఇటువంటి వ్యాఖ్యలు వచ్చినా .. సరే మొన్న ఊకదంపుడు గారు తెరపిచ్చారని రానెరె గారు పోటారు. వారిచ్చిన సమస్య కి నేను ప్రయత్నించిన ప్రయత్నం.
పరమాన హరీ!యని సహ
కరిస్తు తాటకతనయుడు, కర్ణుడు రణమున్
హరిగతి చేరిరి కూర్మితొ
దురాత్ములదరిన సనాతనునిగ కుదురునే
ఈ సారేనా యతులు గణాలు పాటించాను అని అనుకొంటున్నాను.
రెండుమార్లు దెబ్బలు తిని మునిపుంగవుగుగా మారిన మారీచుడి పలుకులు
నేను పైన పద్యములొ మారీచుడిని , కర్ణుడుని మహాత్ములుగా చిత్రీకరించాను. కర్ణుడు మంచివాడు దుర్యోధనుడి తో స్నేహం చేయడం వల్ల దురాత్ముడుగా మారాడు అది అందరికి తెలిసిన విషయమే. మారీచుడు రాక్షసుడు దుష్కార్యాలు చేసాడు. కాని మారిపోయాడు. మొదటి సారిగా విశ్వామిత్రుడి యాగం లొ రామ బాణం వల్ల వెళ్ళి దండకారణ్యం వెళ్ళి పడతాడు. రెండవ సారి రాముడు అరణ్యవాసం చెయ్యడానికి వెళ్తుండా , మారీచుడు ఇద్దరు రాక్షసులతో భయంకరమైన జంతువు వేషాలు వేసుకొని తిరుగుతూ ఉండగా రాముడు కనిపిస్తే రాముడిని చంపే ప్రణాళిక తో రథం వైపు దూసుకొని వెళ్ళాడు. అప్పుడు ఇద్దరు రాక్షసులు మరణిస్తారు. మారీచుడు ఎలాగో తప్పించుకొంటాడు.(అరణ్యకాండ-సర్గ ౩౯) ఇలా రెండు సార్లు రామచంద్రుల దెబ్బలు తిని మునిపుంగవుడుగా మారిపోతాడు. రావణాసురుడు సీతాపహరణం కోసం సహాకరించమని అడగడం కోసం వెళ్ళినప్పుడు మారీచుడీ పరిస్థితి
తత్ర కృష్ణాజిన ధారణమ్ జటవల్క ధారిణమ్
దదర్శ నియత ఆహారమ్ మారీచమ్ నామ రాక్షసమ్ (ఆరణ్యకాండ-౩౫ సర్గ- ౩౯ శ్లోకం)
రావణాసురిడిని జింక వేషం వేసి సీతాపహరణానికి సహాయంచెయ్యమని అడుగుతాడు అప్పుడు మారీచుడీ పరిస్థితి
తస్య రామ కథమ్ శ్రుత్వా మారీచస్య మహాత్మనః
శుష్మమ్ సమభవత్ వక్ త్రమ్ పరిత్రస్తో బభూవచ (అరణ్యకాండ - ౩౬ సర్గ ౨౨ శ్లోకం)
ఆమాటలు విన్నవేంటనే మారీచుడీ నోరు శుష్మించుకొని పోయింది
సులభాః పురుషా రాజన్ సతతమ్ ప్రియ వాదినః
అప్రియస్య చపథ్యస్య వక్తా శ్రేతా చ దుర్లభః (అరణ్య కాండ - సర్గ ౩౭-౨ శ్లోకం)
రావణ నీకు ఎవరో సరైన సలహా ఇవ్వలేదా?
రామో విగ్రహవాన్ ధర్మ సాధు సత్య పరాక్రమః
రాజ సర్వస్య లోకస్య దేవానానమ్ ఇవవాసవః (అరణ్య కాండ - సర్గ ౩౭-శ్లోకం ౧౩)
బాహ్య లంకెలు: వాల్మీకి రామాయాణం
పరమాన పదం నా పరిమిత పరిజ్ఞానం ప్రకారం పరమ+ఆన నుండి వస్తుంది అనుకొంటున్నాను
Monday, 1 October 2007
మొక్కుబడి తీర్చినట్లు
నేను పూరించిన పూరణ పద్యము గా కంటే వచనంలాగా ఉన్నది. కాని వ్రాసాను కాబట్టి బ్లాగుతున్నాను. ఈ పూరణ మాత్రం వ్రాశాం అంటే వ్రాసాము అన్నట్లు ఉన్నది (మొక్కుబడి తీర్చినట్లు) .

కం
హరి కనుమనాడు ధవళా
శ్వరూఢుఢై పారు వేట జరుపుతు వనమున్
కరిని గని వెంట బడగా
ధరణీసుత గనెను పతిని తరుణుల మధ్యన్

శ్రీ హరి క్షత్రియ ధర్మం ప్రకారం కనుమనాడు గోగర్భం నుండి నారాయణవనం కు వేట కు వెళ్ళినప్పుడు పద్మావతి దేవి (ఆకాశరాజు భార్య = ధరణి దేవి వేరే విధంగా పద్మావతి అయోనిజ) తన చెలికెత్తలతో ఆడుతూ ఉండగా హరి ఆ మార్గం లొ వచ్చినప్పుడు తన పతిని మెదటి సారి గాంచుతుంది.తిరుమలలొ ఇప్పటికి కనుమ నాడు పార్వేట ఉత్సవం జరుపుతారు.
తూములు లేక కష్టములు
ముందుగా తూములు గురించి
తూము = ఒక గది లొని నీరు (మురుగు నీరు) బయటకు పోయే ద్వారము. ఈ పదము తెలియని వారు ఒకసారి 30,00 పదాలు దాటిన విక్షనరి లొకి తొంగి చూసి అర్థం తెలుసుకొండి. గోదావరి జిల్లా ల భాషలొ తూము వేరే మాండలికాలలొ ఏమంటారొ నాకు తెలియదు. పాత కాలపు ఇళ్ళలొ ప్రతి గదికి తూములు ఉండేవి. ఇప్పటి నూతన శైలి నిర్మాణాలలొ గదులలొ తూములు అంతరించాయి కాని స్నానాల గదులలొ, సందులలొ తూములు ఇంకా అంతరించలేదు. అదే పాశ్యాత్య దేశాలలొ అయితే గదులలో కాదుకదా స్నానల గదులలొ కూడా తూములు కనిపించవు.పాశ్యాత్య దేశలలొ స్నానల గదులే వెరైటీ గా ఉంటాయి(భారత దేశములొ కూడా ఇప్పుడు ఇటువంటి స్నానల గదులు వస్తున్నాయి అనుకొండి).
సరే అసలు కథ
మొన్న నాస్నేహితుడు కొత్తగా ఇల్లు మారుతున్నాను రమ్మనాడు. సరేనని వెళ్ళాను. వాడు అదే రోజు సాయింకాలము కొత్త రూముకి మారాడు. రాత్రి ఇద్దరం పడుకొన్నం. తెల్లవారి లేచి లేవకుండనే వాడీకి ఫోను వచ్చి అర్జంటుగా మొగము మాత్రం కడూక్కొని (అదృష్టవంతుడు) వెళ్ళిపోయాడు. ఖాళిగా ఉన్న నేను ఆలస్యముగా లేచి స్నానం చేయాల వద్దా అని ఆలోచించి మొగము కడుక్కొని స్నానము చేయనిశ్చయించాను (కర్మ కాలి).
వాడీ బాత్రూము వెరైటీగా ఉమ్మది. ఒక అరుగు చుట్టు తర (కర్టెను) ఉన్నది (షవర్). సరే స్నానానికి దిగాను, చిన్న అరుగు వల్ల స్నానము చేసినప్పుడు నీళ్ళు క్రింద నేల మీద పడి బాత్ రూం నేల తడి అవ్వకుండా జాగ్రత్త పడాలి అని మనసులొ అనుకొన్నాను. సరే గోరు వెచ్చగా నీళ్ళు వస్తున్నాయని ఒక పది నిమిషాలు షవర్ క్రింద స్నానము చేశాను.
స్నానము చేసి క్రిందకు దిగితే ఒక చిన్న యేరు తయారు అయ్యింది ఏమి అవకూడదు అని అనుకొన్నానో అదే జరిగిందని భాద పడ్డాను.
తూము లేక
నీళ్ళు ఒక అంగుళం లోతు లొ ఉన్నయి. సరే తూములు లేని బాత్ రూం నీరు ఎక్కడకి పోయే ఏర్పాటు లేదు. చేసేది ఏమి లేక అక్కడ ఒక గుడ్డ కనిపిస్తే ఆ గుడ్డ తో నీళ్ళు వత్తి షవర్ లొ స్నానము చేసినప్పుడు పోయే నీరు పోయేచోటా పోశాను.ఎంతకీ నీరు తగ్గక పోవడం తోటి సందేహం వచ్చి వత్తిన నీళ్ళు షవర్ లొని తూములో పోయకుండ ఒక బకెట్టు లోకి పోసి తరువాత ఆ నీటిని షవర్ క్రింద తూములొ పోశాను. అప్పుడు తెలిసింది. షవర్ అరుగుకి కి లీక్ ఉన్నదని పోసిన వెంటే అప్పటిదాకా ఇంకి ఉన్న బాత్ రూం నిండింది.

బుద్ధి వచ్చి ఆ మళ్ళి ఆ నీళ్ళు వొత్తి వేరే బాత్ రూం లొని పారబోశాను. ఇలా బాత్ రూం శుభ్రం చేయడానికి గంట పట్టింది. ఈ సంఘటనతో పుట్టిన కందం పద్యము.
కం.
జల జల జారే వెచ్చని
జలంబుల జలకములాడగ గదిన సెలయే
రులు పారె పారిన యేరుల
జలములు ఒత్తగ నడుముల గూళ్ళు వాచే
Thursday, 20 September 2007
నా మాటలతో ఆటవెలది
నోటువెలది చూసి చూసి చదువరుల
గురులఘువులున్ చదివి చదివి తెలు
గున నేను మెదటి ఆటవెలది రాయు రాయు
నాటపా జనంభు కాంచు కాంచు
Saturday, 18 August 2007
కరుణ శ్రీ జంద్యాల పాపయ్య శాస్త్రి గారు వ్రాసిన పద్యం
నా ప్రణయాంకమే సిద్ధ పరచనుంటి
పాద్యమ్ము నిడ మాకు పన్నీరు లేదు
నా కన్నీళ్ళతో కాళ్ళు కడుగనుంటి
పూజకై మా వీట పుష్పాలు లేవు నా
ప్రేమాంజలులె సమర్పిన్ప నుంటి
నైవేద్య మిడ మాకు నారికేళము లేదు
హృదయమే చేతి కందీయనుంటి
లోటు రానీయ నున్నంతలోన నీకు
రమ్ము! దయసేయు మాత్మ పీఠమ్ము పైకి
అమృత ఝ్హురి చిందు నీ పదాన్కముల యందు
కోటి స్వర్గాలు మొలపించుకొనుచు తండ్రి!
Friday, 17 August 2007
చిన్ననాటి పద్యాలు
కదలకుమీధరాతలమ కాశ్యపి బట్టు ఫణీంద్ర భూవిషా
స్పదుక బట్టు కూర్మమరసాతల భోగిడులీ కులీశులన్
వదలక పట్టు ధరణీ ఫణి కఛ్ఛప పోత్రి వర్గమున్
బొదువుచు బట్టుడీ భూపరుదీశుని చాపమొక్కిడిన్
Friday, 10 August 2007
సంస్కృత వారాల పేర్లు
ఆదివారము=భానువారము
సోమవారము=ఇందువారము
మంగళవారము=భౌమవారము
బుధవారము=సౌమ్యవారము
గురువారము=బృహస్పతివారము/గురువారము
శుక్రవారము=భృగువారము
శనివారము=స్థిరవారము/మందవారము
Sunday, 1 July 2007
జీర్ణం జీర్ణం వాతాపి జీర్ణం!!!
జీర్ణం జీర్ణం వాతాపి జీర్ణం, ఏనుగు తిన్న వెలగ పండు జీర్ణం, గుఱ్ఱం తిన్న గుగ్గిళ్ళు జీర్ణం, మా పిల్లవాడు తిన్న అన్నం జీర్ణం అని తల్లులు చంటి పిల్లలు అన్నం తిన్నక అంటుంటారు. దీని వెనుక ఒక కథ ఉన్నది.
ఇది పురాణాలొని విషయం, రామాయణంలొ అరణ్యకాండ లొ చెప్పబడింది. శ్రీ రాముడు అరణ్యవాసం చేస్తూ అగస్త్యుడు ఉండే ఆశ్రమం జాడ సుతీష్ణుడు అనే ఋషి వల్ల కనుగొంటాడు. సీతారామ లక్ష్మణులు అగస్త్యుడి ఆశ్రమాన్ని వెదుకు కుంటూ వెళ్తంటే ఒక పెద్ద బూడిద గుట్ట, ఎముకల గుట్ట కనిపిస్తుంది. అప్పుడు రాముడు సీత లక్ష్మణులను చూసి ఆక్కడ పూర్వం జరిగిన వృత్తాంత్తాన్ని చెబుతాడు.
పూర్వ కాలం లొ ఇల్వలుడు వాతాపి అనే ఇద్దరు రాక్షసులు ఉండేవారు. వారిలొ ఇల్వలుడికి మృతసంజీవిని విద్య వచ్చు, వాతాపి కి కామరూప విద్య వచ్చు. వీరు నరమాసం భంజించడం కోసం ఒక ప్రణాళిక వేసుకొనేవారు. వాతాపి కామారూప విద్యతొ మేక గా మారిపోయేవాడు. ఇల్వలుడు మార్గమధ్యం లొ కనిపించే బ్రాహ్మణులను తన తండ్రి శార్ధ కర్మకు భోక్తగా రమ్మని వేడుకొనే వాడు. త్రేతా యుగ ఆచారాల ప్రకారం శార్థంలొ మాంసం పెట్టాలి కాబట్టి మేకగా మారిన వాతాపిని మాంసం కూర చేసి వడ్డించేవాడు. భోజనం అంతా పూర్తి అయ్యేసరికి ఇల్వలుడు తన మృత సంజీవిని విద్య నుపయోగించి వాతాపి పిలిచేవాడు. వాతాపి ఆ బ్రాహ్మణుడి ఉదరాన్ని చీల్చుకొని బయటకు వచ్చేవాడు. అప్పుడు ఇల్వలుడు వాతాపి కలసి ఆ బ్రాహ్మణుడిని భంజించేవారు.
ఇలా ఉండగా ఒకరోజు అగస్త్యుడు ఆ మార్గం లొ వెళ్తుండడం చూసి ఇల్వలుడు తన తండ్రి ఆర్థికం దానికి భోక్తగా రమ్మంటాడు. త్రికాల వేది అయిన అగస్త్యుడు విషయాన్ని పసి గట్టి సరే అని ఒప్పు కొంటాడు. యధాప్రకారం వాతాపి ని మాంసం కూర గా చేసి వడ్డిస్తాడు, అగస్త్యుడి ఉత్తరోపాసన అయ్యాకా ఇల్వలుడూ తన మృతసంజీవిని విద్య ఉపయోగించి వాతాపి రా అంటాడు. అప్పటికే అగస్త్యుడు తన తపోశక్తి నుపయోగించి వాతాపిని జీర్ణం, వాతాపి జీర్ణం అని వాతాపిని పూర్తిగా జీర్ణం చేసేసుకొంటాడు. అప్పుడు ఇల్వలుడి తొ వాతాపి జీర్ణం అయ్యి పోయాడు అని చెప్పగా ఇల్వవుడు కోపంతో క్రూరమైన రాక్షస రూపాన్ని పొంది అగస్త్యుడి మీద వస్తుంటే అగస్త్యుడు ఒక హూంకారం తో అలా మీదకు వస్తున్న ఇల్వలుడిని తపో శక్తితో ఉగ్రం గా చూస్తే ఇల్వలుడు భస్మం అయిపోతాడు.
ఆవిధంగా వాతాపి ని జీర్ణం చేసుకోవడానికి అగస్త్యుడు వాడిన పదాన్ని చంటి పిల్లలు జీర్ణం కావడానికి కష్టం ఉన్న పదార్థం తిన్నప్పుడు పెద్దలు జీర్ణం జీర్ణం వాతాపి జీర్ణం అంటారు. ( వాతాపి లాంటి వాడే జీర్ణం అయ్యి నప్పుడు ఈ పదార్థం జీర్ణం అవ్వడం ఏమంత కష్టం కాదు అని అర్థం)