Friday 17 August 2007

చిన్ననాటి పద్యాలు

ఈ మధ్య అపాత పాఠ్యపుస్తకాల బ్లాగు చూసే టప్పటికి చిన్నప్పుడు తెలుగు పాఠాలలొని పద్యాలు గుర్తు వస్తున్నాయి. పద్యాలు నాకు స్పురణలొ ఉన్నాయి కాని అక్షర దోషాలు పెక్కు ఉండవచ్చు, కావున ఈ పద్యాలు చదివేవారు ఈ దోషాలు చూపితే సరిచేసుకొనగలను.
కదలకుమీధరాతలమ కాశ్యపి బట్టు ఫణీంద్ర భూవిషా
స్పదుక బట్టు కూర్మమరసాతల భోగిడులీ కులీశులన్
వదలక పట్టు ధరణీ ఫణి కఛ్ఛప పోత్రి వర్గమున్
బొదువుచు బట్టుడీ భూపరుదీశుని చాపమొక్కిడిన్

3 comments:

  1. నాకు ఇంకోటి గుర్తుకొచ్చింది.....(ఇందీవరాక్షుని వృత్తాంతము)

    అనినన్ కన్నులు జేవురింప అధరంబల్లాడ వేల్లత్పునః
    పునరుద్యత్ భృకుటీ భుజంగ యుగళీ పూత్కార ఘో
    రానిలంబ నూర్పుల్ నిగుడన్ లలాట ఫలకంబందంద ఘర్మంబువుల్
    చినుకన్ దిదృక్ష రూక్ష నయన క్ష్వేలా కరాళ ధ్వనిన్

    ReplyDelete
  2. అదరగొట్టారండి.
    నాకు ఇది చాలా ఫావరెట్, విని చలా రోజులైంది.
    ఈ వాళ కార్టూన్ నెట్వర్కలో the legend of buddha చూస్తుంటే, అందులో రాముడు విల్లు సీనును పెట్టాడు.
    అప్పుడు నాకీ పద్యభావం గుర్తుకువచ్చింది.
    దీన్ని నా collection లో చేర్చాలి.

    ReplyDelete
  3. అన్నట్టు మీరు వ్రాసిన పద్యాలలో తప్పులు ఉన్నట్టనిపిస్తున్నాయి.
    వృత్తాల లయలు గుర్తుపెట్టుకుంటే వాటిని పూర్తిగా అరికట్ట వచ్చు. మీకు చాలా పద్యాలు వచ్చు కాబట్టి అది పెద్ద కష్టం అవ్వదు.
    దానికి ఈ టపా అందులోని బొమ్మలూ ఉపయోగపడవచ్చు,
    http://andam.blogspot.com/2007/07/blog-post_17.html

    అడగకుండా సూచించినందుకు మన్నించాలి, కాని మీదగ్గరనుండి పద్యాలు కాపీపేష్టు చేసుకోవలసిన వాడిని కాబట్టి చెబుతున్నాను.:)

    ReplyDelete

మీ సందేశం