Saturday, 18 August 2007

కరుణ శ్రీ జంద్యాల పాపయ్య శాస్త్రి గారు వ్రాసిన పద్యం

కూర్చుండ మా యింట కురిచీలు లేవు
నా ప్రణయాంకమే సిద్ధ పరచనుంటి
పాద్యమ్ము నిడ మాకు పన్నీరు లేదు
నా కన్నీళ్ళతో కాళ్ళు కడుగనుంటి
పూజకై మా వీట పుష్పాలు లేవు నా
ప్రేమాంజలులె సమర్పిన్ప నుంటి
నైవేద్య మిడ మాకు నారికేళము లేదు
హృదయమే చేతి కందీయనుంటి

లోటు రానీయ నున్నంతలోన నీకు
రమ్ము! దయసేయు మాత్మ పీఠమ్ము పైకి
అమృత ఝ్హురి చిందు నీ పదాన్కముల యందు
కోటి స్వర్గాలు మొలపించుకొనుచు తండ్రి!

3 comments:

 1. అబ్బో చాలా చాలా మంచి సీసం అండి, నా ఆల్ టైం ఫావరెట్లలో ఒకటి.

  ReplyDelete
 2. అన్నట్టు మీ కోర్కె మన్నించి ఒ రెండు టపాలేసా ఈ మధ్య :)

  ReplyDelete
 3. ఈ రెండూ చూడండి.

  http://vinnakanna.blogspot.com/2007/07/blog-post.html

  http://vinnakanna.blogspot.com/2007/07/blog-post_18.html

  ReplyDelete

మీ సందేశం