కూర్చుండ మా యింట కురిచీలు లేవు
నా ప్రణయాంకమే సిద్ధ పరచనుంటి
పాద్యమ్ము నిడ మాకు పన్నీరు లేదు
నా కన్నీళ్ళతో కాళ్ళు కడుగనుంటి
పూజకై మా వీట పుష్పాలు లేవు నా
ప్రేమాంజలులె సమర్పిన్ప నుంటి
నైవేద్య మిడ మాకు నారికేళము లేదు
హృదయమే చేతి కందీయనుంటి
లోటు రానీయ నున్నంతలోన నీకు
రమ్ము! దయసేయు మాత్మ పీఠమ్ము పైకి
అమృత ఝ్హురి చిందు నీ పదాన్కముల యందు
కోటి స్వర్గాలు మొలపించుకొనుచు తండ్రి!
Subscribe to:
Post Comments (Atom)
అబ్బో చాలా చాలా మంచి సీసం అండి, నా ఆల్ టైం ఫావరెట్లలో ఒకటి.
ReplyDeleteఅన్నట్టు మీ కోర్కె మన్నించి ఒ రెండు టపాలేసా ఈ మధ్య :)
ReplyDeleteఈ రెండూ చూడండి.
ReplyDeletehttp://vinnakanna.blogspot.com/2007/07/blog-post.html
http://vinnakanna.blogspot.com/2007/07/blog-post_18.html