Saturday 18 August 2007

కరుణ శ్రీ జంద్యాల పాపయ్య శాస్త్రి గారు వ్రాసిన పద్యం

కూర్చుండ మా యింట కురిచీలు లేవు
నా ప్రణయాంకమే సిద్ధ పరచనుంటి
పాద్యమ్ము నిడ మాకు పన్నీరు లేదు
నా కన్నీళ్ళతో కాళ్ళు కడుగనుంటి
పూజకై మా వీట పుష్పాలు లేవు నా
ప్రేమాంజలులె సమర్పిన్ప నుంటి
నైవేద్య మిడ మాకు నారికేళము లేదు
హృదయమే చేతి కందీయనుంటి

లోటు రానీయ నున్నంతలోన నీకు
రమ్ము! దయసేయు మాత్మ పీఠమ్ము పైకి
అమృత ఝ్హురి చిందు నీ పదాన్కముల యందు
కోటి స్వర్గాలు మొలపించుకొనుచు తండ్రి!

Friday 17 August 2007

చిన్ననాటి పద్యాలు

ఈ మధ్య అపాత పాఠ్యపుస్తకాల బ్లాగు చూసే టప్పటికి చిన్నప్పుడు తెలుగు పాఠాలలొని పద్యాలు గుర్తు వస్తున్నాయి. పద్యాలు నాకు స్పురణలొ ఉన్నాయి కాని అక్షర దోషాలు పెక్కు ఉండవచ్చు, కావున ఈ పద్యాలు చదివేవారు ఈ దోషాలు చూపితే సరిచేసుకొనగలను.
కదలకుమీధరాతలమ కాశ్యపి బట్టు ఫణీంద్ర భూవిషా
స్పదుక బట్టు కూర్మమరసాతల భోగిడులీ కులీశులన్
వదలక పట్టు ధరణీ ఫణి కఛ్ఛప పోత్రి వర్గమున్
బొదువుచు బట్టుడీ భూపరుదీశుని చాపమొక్కిడిన్

Friday 10 August 2007

సంస్కృత వారాల పేర్లు

సంస్కృత వారాల పేర్లు తెలియక నానావస్థ పడ్డాను.విషయం తెలిసిందని ఇక్కడ పొందు పరుస్తున్నాను.
ఆదివారము=భానువారము
సోమవారము=ఇందువారము
మంగళవారము=భౌమవారము
బుధవారము=సౌమ్యవారము
గురువారము=బృహస్పతివారము/గురువారము
శుక్రవారము=భృగువారము
శనివారము=స్థిరవారము/మందవారము