Monday, 1 October 2007

మొక్కుబడి తీర్చినట్లు

ధరణీసుతగనెను పతిని తరుణుల మధ్యన్ అనే ఊకదంపుడు గారి బాంబుకి శ్రీరాం గారు శ్రీకారం లో చాలా అత్యాద్భుతంగా సీతారాముల కళ్యాణం చేయించారు. అనే పద్యానికి వారిచ్చిన పూరణ చాలా బాగా నచ్చింది. దాని చూసి నాకు కూడా దురద పుట్టి ఏవిధంగా ఒక పూరణ చెయ్యాలని అనిపించింది. చూస్తే వచ్చి రాని తెలుగు ఇప్పటికి మూడు పద్యాలు ప్రయత్నించి విఫలం అయ్యాను.. సరే మళ్ళి మళ్ళి ప్రయత్నిస్తే గాని మంచి ఫలితం రాదని భావించి మళ్ళి కందాన్ని పండించడానికి ప్రయత్నిస్తున్నాను.
నేను పూరించిన పూరణ పద్యము గా కంటే వచనంలాగా ఉన్నది. కాని వ్రాసాను కాబట్టి బ్లాగుతున్నాను. ఈ పూరణ మాత్రం వ్రాశాం అంటే వ్రాసాము అన్నట్లు ఉన్నది (మొక్కుబడి తీర్చినట్లు) .


కం
హరి కనుమనాడు ధవళా
శ్వరూఢుఢై పారు వేట జరుపుతు వనమున్
కరిని గని వెంట బడగా
ధరణీసుత గనెను పతిని తరుణుల మధ్యన్


శ్రీ హరి క్షత్రియ ధర్మం ప్రకారం కనుమనాడు గోగర్భం నుండి నారాయణవనం కు వేట కు వెళ్ళినప్పుడు పద్మావతి దేవి (ఆకాశరాజు భార్య = ధరణి దేవి వేరే విధంగా పద్మావతి అయోనిజ) తన చెలికెత్తలతో ఆడుతూ ఉండగా హరి ఆ మార్గం లొ వచ్చినప్పుడు తన పతిని మెదటి సారి గాంచుతుంది.తిరుమలలొ ఇప్పటికి కనుమ నాడు పార్వేట ఉత్సవం జరుపుతారు.

5 comments:

 1. రెండో పాదంలో
  వేటను - స్థానంలో జ లేదా నల గణం వుండాలి కదా..

  ReplyDelete
 2. మాటలబాబు గారూ, మీ ఉత్సాహం చూస్తే నాకూ ఉత్సాహం వస్తోంది. మీ పద్యాలు మెరుగుపడుతున్నాయి. త్వరలోనే మంచి పద్యం రాయగలరు.

  ఇక్కడ మీ భావన బాగుంది. ధరణీ దేవి అంటే ఆకాశరాజు భార్య పేరు అని చాలామందికి తెలియదు. మంచి ప్రయత్నం.

  "అశ్వరూరుడు" కాదండీ, "అశ్వారూఢుడు" సరైంది. రాకేశ్వరుని సూచన కూడా చూడండి. పద్యం దిద్దడానికి ప్రయత్నించండి.

  ReplyDelete
 3. అరరరే!! ఇది మాటలబాబు గారి బ్లాగా! చాలా మంచి ప్రయత్నం. మీ ఆటవెలది ప్రయత్నాన్ని ఒకసారి చూశాను. పద్యాలబాబు తయారౌతున్నాడనుకున్నాను. మీ పూరణకు బొమ్మలు కూడా బాగున్నాయి.

  ReplyDelete
 4. @రాకేశ్వరుడు, రెండవ పాదం లొ యతి ముందు జ గణం కిట్టించాను
  @శ్రీరాం గారు ధవ్యవాదాలు, ఆలోచన వచ్చింది కాని పద్యం రాలేదు
  @రానారె గారు బాగ్లాగేశ్వరుడు బ్లాగుకి వచ్చినందుకు ధన్యవాదాలు, మీ పలుకులకు కృతజ్ఞుడ్ని

  ReplyDelete
 5. హరి అంటే గుఱ్ఱం అనే అర్దం కూడా ఉంది (?)..అందువల్ల - రెండో పాదాన్ని - హరివాహనుడై అని మొదలు పెట్టవచ్చు.

  హరి కనుమనాడు, వనమున
  హరివాహనుడై జనుచును హస్తిని గనియే
  శరమున గూల్చగ బోవగ-
  ధరణీసుతగనెను పతిని తరుణులమధ్యన్

  ఐతే ..అప్పటికి - ఇంకా పెళ్లిఅయిందా అన్న ప్రశ్న వస్తుంది.

  కందానికి షరతులు ఎక్కువ - మీ ప్రయత్నం బాగుంది.. ఇంతటితో వదిలి పెట్టక ఇలానే ప్రయత్నించండి,సాధనమీద గణయతులు అవే కుదురుతాయి.

  ReplyDelete

మీ సందేశం