Monday, 1 October 2007

తూములు లేక కష్టములు

ఈ సంఘటన బ్లాగచ్చో బ్లాగ కూడదో...... బ్లాగాల వద్దా...... అని చాల ఆలోచించి బ్లాగుతున్నాను.
ముందుగా తూములు గురించి
తూము = ఒక గది లొని నీరు (మురుగు నీరు) బయటకు పోయే ద్వారము. ఈ పదము తెలియని వారు ఒకసారి 30,00 పదాలు దాటిన విక్షనరి లొకి తొంగి చూసి అర్థం తెలుసుకొండి. గోదావరి జిల్లా ల భాషలొ తూము వేరే మాండలికాలలొ ఏమంటారొ నాకు తెలియదు. పాత కాలపు ఇళ్ళలొ ప్రతి గదికి తూములు ఉండేవి. ఇప్పటి నూతన శైలి నిర్మాణాలలొ గదులలొ తూములు అంతరించాయి కాని స్నానాల గదులలొ, సందులలొ తూములు ఇంకా అంతరించలేదు. అదే పాశ్యాత్య దేశాలలొ అయితే గదులలో కాదుకదా స్నానల గదులలొ కూడా తూములు కనిపించవు.పాశ్యాత్య దేశలలొ స్నానల గదులే వెరైటీ గా ఉంటాయి(భారత దేశములొ కూడా ఇప్పుడు ఇటువంటి స్నానల గదులు వస్తున్నాయి అనుకొండి).
సరే అసలు కథ
మొన్న నాస్నేహితుడు కొత్తగా ఇల్లు మారుతున్నాను రమ్మనాడు. సరేనని వెళ్ళాను. వాడు అదే రోజు సాయింకాలము కొత్త రూముకి మారాడు. రాత్రి ఇద్దరం పడుకొన్నం. తెల్లవారి లేచి లేవకుండనే వాడీకి ఫోను వచ్చి అర్జంటుగా మొగము మాత్రం కడూక్కొని (అదృష్టవంతుడు) వెళ్ళిపోయాడు. ఖాళిగా ఉన్న నేను ఆలస్యముగా లేచి స్నానం చేయాల వద్దా అని ఆలోచించి మొగము కడుక్కొని స్నానము చేయనిశ్చయించాను (కర్మ కాలి).వాడీ బాత్రూము వెరైటీగా ఉమ్మది. ఒక అరుగు చుట్టు తర (కర్టెను) ఉన్నది (షవర్). సరే స్నానానికి దిగాను, చిన్న అరుగు వల్ల స్నానము చేసినప్పుడు నీళ్ళు క్రింద నేల మీద పడి బాత్ రూం నేల తడి అవ్వకుండా జాగ్రత్త పడాలి అని మనసులొ అనుకొన్నాను. సరే గోరు వెచ్చగా నీళ్ళు వస్తున్నాయని ఒక పది నిమిషాలు షవర్ క్రింద స్నానము చేశాను.
స్నానము చేసి క్రిందకు దిగితే ఒక చిన్న యేరు తయారు అయ్యింది ఏమి అవకూడదు అని అనుకొన్నానో అదే జరిగిందని భాద పడ్డాను.
తూము లేక
నీళ్ళు ఒక అంగుళం లోతు లొ ఉన్నయి. సరే తూములు లేని బాత్ రూం నీరు ఎక్కడకి పోయే ఏర్పాటు లేదు. చేసేది ఏమి లేక అక్కడ ఒక గుడ్డ కనిపిస్తే ఆ గుడ్డ తో నీళ్ళు వత్తి షవర్ లొ స్నానము చేసినప్పుడు పోయే నీరు పోయేచోటా పోశాను.ఎంతకీ నీరు తగ్గక పోవడం తోటి సందేహం వచ్చి వత్తిన నీళ్ళు షవర్ లొని తూములో పోయకుండ ఒక బకెట్టు లోకి పోసి తరువాత ఆ నీటిని షవర్ క్రింద తూములొ పోశాను. అప్పుడు తెలిసింది. షవర్ అరుగుకి కి లీక్ ఉన్నదని పోసిన వెంటే అప్పటిదాకా ఇంకి ఉన్న బాత్ రూం నిండింది.బుద్ధి వచ్చి ఆ మళ్ళి ఆ నీళ్ళు వొత్తి వేరే బాత్ రూం లొని పారబోశాను. ఇలా బాత్ రూం శుభ్రం చేయడానికి గంట పట్టింది. ఈ సంఘటనతో పుట్టిన కందం పద్యము.


కం.

జల జల జారే వెచ్చని

జలంబుల జలకములాడగ గదిన సెలయే

రులు పారె పారిన యేరుల

జలములు ఒత్తగ నడుముల గూళ్ళు వాచే

2 comments:

  1. u r killing the chandassu

    ReplyDelete
  2. This comment has been removed by a blog administrator.

    ReplyDelete

మీ సందేశం