Sunday, 14 October 2007

మారీచుడు కర్ణుడు రాముడు శ్రీరాముడు

కంద గడ్డ కత్తిపీట కి దురద పుట్టిస్తుందో లేదో తెలియదుకాని నాకు మాత్రము కందం పేరు చెబితే బాగా పద్యం వ్రాయాలని దురద పుడుతోంది, ఇటువంటి వ్యాఖ్యలు వచ్చినా .. సరే మొన్న ఊకదంపుడు గారు తెరపిచ్చారని రానెరె గారు పోటారు. వారిచ్చిన సమస్య కి నేను ప్రయత్నించిన ప్రయత్నం.


పరమాన హరీ!యని సహ
కరిస్తు తాటకతనయుడు, కర్ణుడు రణమున్
హరిగతి చేరిరి కూర్మితొ
దురాత్ములదరిన సనాతనునిగ కుదురునే


ఈ సారేనా యతులు గణాలు పాటించాను అని అనుకొంటున్నాను.


రెండుమార్లు దెబ్బలు తిని మునిపుంగవుగుగా మారిన మారీచుడి పలుకులు

నేను పైన పద్యములొ మారీచుడిని , కర్ణుడుని మహాత్ములుగా చిత్రీకరించాను. కర్ణుడు మంచివాడు దుర్యోధనుడి తో స్నేహం చేయడం వల్ల దురాత్ముడుగా మారాడు అది అందరికి తెలిసిన విషయమే. మారీచుడు రాక్షసుడు దుష్కార్యాలు చేసాడు. కాని మారిపోయాడు. మొదటి సారిగా విశ్వామిత్రుడి యాగం లొ రామ బాణం వల్ల వెళ్ళి దండకారణ్యం వెళ్ళి పడతాడు. రెండవ సారి రాముడు అరణ్యవాసం చెయ్యడానికి వెళ్తుండా , మారీచుడు ఇద్దరు రాక్షసులతో భయంకరమైన జంతువు వేషాలు వేసుకొని తిరుగుతూ ఉండగా రాముడు కనిపిస్తే రాముడిని చంపే ప్రణాళిక తో రథం వైపు దూసుకొని వెళ్ళాడు. అప్పుడు ఇద్దరు రాక్షసులు మరణిస్తారు. మారీచుడు ఎలాగో తప్పించుకొంటాడు.(అరణ్యకాండ-సర్గ ౩౯) ఇలా రెండు సార్లు రామచంద్రుల దెబ్బలు తిని మునిపుంగవుడుగా మారిపోతాడు. రావణాసురుడు సీతాపహరణం కోసం సహాకరించమని అడగడం కోసం వెళ్ళినప్పుడు మారీచుడీ పరిస్థితి

తత్ర కృష్ణాజిన ధారణమ్ జటవల్క ధారిణమ్

దదర్శ నియత ఆహారమ్ మారీచమ్ నామ రాక్షసమ్ (ఆరణ్యకాండ-౩౫ సర్గ- ౩౯ శ్లోకం)


రావణాసురిడిని జింక వేషం వేసి సీతాపహరణానికి సహాయంచెయ్యమని అడుగుతాడు అప్పుడు మారీచుడీ పరిస్థితి
తస్య రామ కథమ్ శ్రుత్వా మారీచస్య మహాత్మనః

శుష్మమ్ సమభవత్ వక్ త్రమ్ పరిత్రస్తో బభూవచ (అరణ్యకాండ - ౩౬ సర్గ ౨౨ శ్లోకం)

ఆమాటలు విన్నవేంటనే మారీచుడీ నోరు శుష్మించుకొని పోయింది

సులభాః పురుషా రాజన్ సతతమ్ ప్రియ వాదినః

అప్రియస్య చపథ్యస్య వక్తా శ్రేతా చ దుర్లభః (అరణ్య కాండ - సర్గ ౩౭-౨ శ్లోకం)
రావణ నీకు ఎవరో సరైన సలహా ఇవ్వలేదా?

రామో విగ్రహవాన్ ధర్మ సాధు సత్య పరాక్రమః

రాజ సర్వస్య లోకస్య దేవానానమ్ ఇవవాసవః (అరణ్య కాండ - సర్గ ౩౭-శ్లోకం ౧౩)

బాహ్య లంకెలు: వాల్మీకి రామాయాణం

పరమాన పదం నా పరిమిత పరిజ్ఞానం ప్రకారం పరమ+ఆన నుండి వస్తుంది అనుకొంటున్నాను

7 comments:

 1. sir,
  mIku pUrANa visEShalu cAlA telusu ..
  ivAlE mI vivEkacUDamaNi cUDaTaM modaTisAri.
  please drop a word to vookadampudu at yahoo dot com ..

  ReplyDelete
 2. Hi
  You are doing a great job. I really appreciate your enthusiasm. You have a good knowledge of puranam's. Well done. Keep up your good work

  ReplyDelete
 3. ప్రయత్నించినందుకు ముందుగా మీకు నెనర్లు. ఈ పద్యానికి గల పురాణనేపథ్యం ఏమిటో నాకు తెలియకపోవడంతో అర్థమేమిటో కూడా తెలియలేదు. దయచేసి ... ఆ కథేమిటో మీరే సెలవివ్వండి ఈశ్వరా!

  ReplyDelete
 4. నా వ్యాఖ్యల డబ్బా తెరుచుకోవడం లేదని మీదగ్గర నుంచి ఒక వేగు వచ్చింది. వేగు చిరునామా కొంచెం అనుమానాస్పదంగా ఉంది, చొప్ప వేగేమోనని (spam) అనుమానంతో ఇక్కడ రాస్తున్నా..అది మీరు పంపిన వేగే ఐతే, ఏమంటున్నారో నాకు అర్ధం అవ్వడం లేదు, వివరించండి..

  ReplyDelete
 5. గణాల యతుల సంగతెలా ఉన్నా మీరు పూరణకోసం ఒక అపురూపమైన ఎత్తుగడ తీసుకురావడం చాలా బాగుంది. (ఈ లక్షణం మీ వేంకటేశ్వరుని పూరణలో కూడా గమనించాను.) బహు చమత్కారంగా ఉంది. అసలు మామూలుగానే లహువుతో మొదలయ్యే కందం రాయడం కష్టం. మీరు ఏకంగా ఒకటీకి మూడు "జ" గణాలు వాడ్డం చూస్తే .. తల తిరుగుతోంది. శబాషో!

  ReplyDelete
 6. మొత్తం కాకపోయినా మొత్తానికి అర్థమైంది. మరింకేం ఇంకొక ప్రత్యేకమైన యువకవి అవతరించారు! పురాణజ్ఞానం అందరికీ అందుబాటులోకి తెండి. వాటినుండి ఎన్నో జీవితపాఠాలు నేర్చుకోవచ్చు.

  ReplyDelete
 7. మీ టపా, మీ పద్యం నాకేమీ అర్థం కాలేదు.
  దానికి చాలా వరకూ నా మానసిక అధోగతే కారణమనుకోండి,
  కానీ ఒక విషయం అర్థమయ్యింది.
  మీరు చాలా ఎత్తు ఎదిగిపోయారు.

  ReplyDelete

మీ సందేశం