Friday 23 November 2007

రాట-టు-యి

నిన్న రాట-టు-యి సినిమా చూద్దామని అనుకొన్నాను కాని చూడడడం కుదరలేదు.

ఆ.వె.
వలదననినను సినిమాకెళ్ళ చూస్తిని
చూస్తి దగ్గరగల చిత్ర గృహము
గృహము కెళ్ళుటకును కాస్తిని బస్సును
బస్సు రాక పోవ పూన్కి విడెను

3 comments:

  1. బ్లాగేశ్వరా,
    గణాలు సరిపోయాయి. ప్రాస విషయంలో గమనించవలసినదేమంటే - హల్లుతో పాటు ఉన్న అచ్చుకూడా మైత్రి పాటించాలి.

    చూ కి చు, చొ, సు, సొ వగైరా
    గృ కి గి, గె, కి, కె వగైరా

    కాకపోతే, ప్రాసయతి పాటించవచ్చు కాబట్టి పాదం రెండవ అక్షరానికి నాల్గవ పాదం రెండవ అక్షరాం మైత్రి కుదిరినా చాలు (ప్రాసయతి కాబట్టి - మామూలు యతిలా కాక ఏ గుణింతమైనా ఫర్వాలేదు)

    మరొక్క విషయం అర్ధనారీశ్వరుల ప్రస్తావన, మీరెలాగు వాగ్విలాసపు చర్చలో ఉన్నారు కాబట్టి అక్కడే రాసాను, అన్యధా భావించవద్దు.

    ReplyDelete
  2. తిన్నగా ఉండవచ్చు కదా ఏదో కొత్తది ప్రయత్నము ముక్తపదగ్రస్తము చేద్దామని చేయ ప్రయత్నించి పప్పులో కాలు వేశాను, యతి కుదరలేదు, ముక్తపదగ్రస్తములొ వ్రాయడం నావల్ల కాదు కాని ప్రస్తుత్తానికి నాప్రయత్నముగ ఇలాగే ఉంచి ఇదే భావాన్ని మరో ఆటవెలదిగా ప్రయత్నిస్తాను.

    ReplyDelete
  3. అందుకేనా మొత్తం కొట్టేశారు?

    ReplyDelete

మీ సందేశం