Thursday, 15 November 2007

నాగుల చవితి

కం.
హరునకు కంఠాభరణము
హరికిని వైకుంఠమున శయన పానుపు ఇ
ద్దరికిని బాంధవ్యముగల
సరీసృపమ్ములకు మానసార్చన చేసెన్

Thursday, 8 November 2007

పద్యాలు వ్రాయవద్దంటే

మా నాన్న గారు ఎందుకురా ఈ పద్యాలతో సమయము వ్యర్థము చేస్తున్నావు....చేయవలసిన పని మానేసి... అన్నారు
అందుకు నాస్పందన

కందములు రాయ వలదన
గాదురదగల కరము నిలకడగ నిలుచునే
ఛందము నేర్చిన వాడిని
బందము చేసిననునతడు పద్యము విడునే

Monday, 22 October 2007

పదములు మూడిచ్చి కంద పద్యమ్మడిగెన్!

ఊకదంపుడు గారి తాటక తనయుడు కర్ణుడు పూరణకి పెట్టిన టపా శీర్షిక చూస్తే నాకు నిన్న రాత్రి సందేహం కలిగింది. కొద్దిగా లోతుగా చూస్తే ఆ టపా శీర్షికలొ కంద పద్యములొ 2, 4 పాదాలకు సరిపడ గణాలు కూర్చి టపా విడిచారు ఊకదంపుడు గారు. ఇంకే దురద ఆగదు కదా

పదములతొ పెండ్లి చేసెను
పదములు పూరణకు కొఱెను పదరున శ్రీరాం
పదములివిగొనని రాముడు
పదములు మూడిచ్చి కంద పద్యమ్మడిగెన్!

ఈ టపా పూర్వాపరాలు తెలియాలంటే ఒకసారి శ్రీరాం గారి సంగతులు సందర్భాలు చదవాల్సిందే..

ఊకదంపుడు గారి సూచనతో

పదములతొ పెండ్లి చేసెను
పదములు పూరింపగోరె పదరున శ్రీరాం
పదములు గొనుడని రాముడు
పదములు మూడిచ్చి కంద పద్యమ్మడిగెన్!

Saturday, 20 October 2007

నకళ్ళతయారీదారులు

గురువుగారు సినిమా అనుభవం గురించి పద్యము వ్రాయ ప్రేరేపింపలేదా అని అన్నారు వారి మాటనుఁద్దేశించి నేను ప్రయత్నించిన కందం. పెద్దలు తప్పులు చెప్పగలరు. చివరి పాదం ఎలా వ్రాయాలొ తెలియలేదు.

అడదడి చిత్రము కన వడి
వడి వెలువడె వివరము విడువ తెలివిడె కథన్
తొడితొడిన ఆంగ్ల లిపియును
తొడుగై రాగా ఘటనలు తొడరును ఇట్లా

Sunday, 14 October 2007

మారీచుడు కర్ణుడు రాముడు శ్రీరాముడు

కంద గడ్డ కత్తిపీట కి దురద పుట్టిస్తుందో లేదో తెలియదుకాని నాకు మాత్రము కందం పేరు చెబితే బాగా పద్యం వ్రాయాలని దురద పుడుతోంది, ఇటువంటి వ్యాఖ్యలు వచ్చినా .. సరే మొన్న ఊకదంపుడు గారు తెరపిచ్చారని రానెరె గారు పోటారు. వారిచ్చిన సమస్య కి నేను ప్రయత్నించిన ప్రయత్నం.


పరమాన హరీ!యని సహ
కరిస్తు తాటకతనయుడు, కర్ణుడు రణమున్
హరిగతి చేరిరి కూర్మితొ
దురాత్ములదరిన సనాతనునిగ కుదురునే


ఈ సారేనా యతులు గణాలు పాటించాను అని అనుకొంటున్నాను.


రెండుమార్లు దెబ్బలు తిని మునిపుంగవుగుగా మారిన మారీచుడి పలుకులు









నేను పైన పద్యములొ మారీచుడిని , కర్ణుడుని మహాత్ములుగా చిత్రీకరించాను. కర్ణుడు మంచివాడు దుర్యోధనుడి తో స్నేహం చేయడం వల్ల దురాత్ముడుగా మారాడు అది అందరికి తెలిసిన విషయమే. మారీచుడు రాక్షసుడు దుష్కార్యాలు చేసాడు. కాని మారిపోయాడు. మొదటి సారిగా విశ్వామిత్రుడి యాగం లొ రామ బాణం వల్ల వెళ్ళి దండకారణ్యం వెళ్ళి పడతాడు. రెండవ సారి రాముడు అరణ్యవాసం చెయ్యడానికి వెళ్తుండా , మారీచుడు ఇద్దరు రాక్షసులతో భయంకరమైన జంతువు వేషాలు వేసుకొని తిరుగుతూ ఉండగా రాముడు కనిపిస్తే రాముడిని చంపే ప్రణాళిక తో రథం వైపు దూసుకొని వెళ్ళాడు. అప్పుడు ఇద్దరు రాక్షసులు మరణిస్తారు. మారీచుడు ఎలాగో తప్పించుకొంటాడు.(అరణ్యకాండ-సర్గ ౩౯) ఇలా రెండు సార్లు రామచంద్రుల దెబ్బలు తిని మునిపుంగవుడుగా మారిపోతాడు. రావణాసురుడు సీతాపహరణం కోసం సహాకరించమని అడగడం కోసం వెళ్ళినప్పుడు మారీచుడీ పరిస్థితి

తత్ర కృష్ణాజిన ధారణమ్ జటవల్క ధారిణమ్

దదర్శ నియత ఆహారమ్ మారీచమ్ నామ రాక్షసమ్ (ఆరణ్యకాండ-౩౫ సర్గ- ౩౯ శ్లోకం)


రావణాసురిడిని జింక వేషం వేసి సీతాపహరణానికి సహాయంచెయ్యమని అడుగుతాడు అప్పుడు మారీచుడీ పరిస్థితి
తస్య రామ కథమ్ శ్రుత్వా మారీచస్య మహాత్మనః

శుష్మమ్ సమభవత్ వక్ త్రమ్ పరిత్రస్తో బభూవచ (అరణ్యకాండ - ౩౬ సర్గ ౨౨ శ్లోకం)

ఆమాటలు విన్నవేంటనే మారీచుడీ నోరు శుష్మించుకొని పోయింది

సులభాః పురుషా రాజన్ సతతమ్ ప్రియ వాదినః

అప్రియస్య చపథ్యస్య వక్తా శ్రేతా చ దుర్లభః (అరణ్య కాండ - సర్గ ౩౭-౨ శ్లోకం)
రావణ నీకు ఎవరో సరైన సలహా ఇవ్వలేదా?

రామో విగ్రహవాన్ ధర్మ సాధు సత్య పరాక్రమః

రాజ సర్వస్య లోకస్య దేవానానమ్ ఇవవాసవః (అరణ్య కాండ - సర్గ ౩౭-శ్లోకం ౧౩)

బాహ్య లంకెలు: వాల్మీకి రామాయాణం

పరమాన పదం నా పరిమిత పరిజ్ఞానం ప్రకారం పరమ+ఆన నుండి వస్తుంది అనుకొంటున్నాను