Monday, 22 October 2007

పదములు మూడిచ్చి కంద పద్యమ్మడిగెన్!

ఊకదంపుడు గారి తాటక తనయుడు కర్ణుడు పూరణకి పెట్టిన టపా శీర్షిక చూస్తే నాకు నిన్న రాత్రి సందేహం కలిగింది. కొద్దిగా లోతుగా చూస్తే ఆ టపా శీర్షికలొ కంద పద్యములొ 2, 4 పాదాలకు సరిపడ గణాలు కూర్చి టపా విడిచారు ఊకదంపుడు గారు. ఇంకే దురద ఆగదు కదా

పదములతొ పెండ్లి చేసెను
పదములు పూరణకు కొఱెను పదరున శ్రీరాం
పదములివిగొనని రాముడు
పదములు మూడిచ్చి కంద పద్యమ్మడిగెన్!

ఈ టపా పూర్వాపరాలు తెలియాలంటే ఒకసారి శ్రీరాం గారి సంగతులు సందర్భాలు చదవాల్సిందే..

ఊకదంపుడు గారి సూచనతో

పదములతొ పెండ్లి చేసెను
పదములు పూరింపగోరె పదరున శ్రీరాం
పదములు గొనుడని రాముడు
పదములు మూడిచ్చి కంద పద్యమ్మడిగెన్!

12 comments:

  1. బ్లాగేశ్వరా,
    మీరు కందం రాయడమెలా అనే విషయం మీద కూడా ఒక కందాన్ని ఆపై వివరణని రాస్తే బావుంటుంది..
    గిరి

    ReplyDelete
  2. bhalE! bhalE! meeru padyaalapai choopistunna abhimaanam entainaa abhinandanIyam!

    ReplyDelete
  3. అయ్యా బ్లాగేశ్వరా,

    నా పద్యంలో ఇంకా తప్పులున్నవా? ఉన్నచో, పద్యములోని గణము ఎక్కడ సరిలేదో దయచేసి వివరింపగలరు.

    ReplyDelete
  4. బ్లాగేశ్వర గారు,

    చిన్న సవరణలు
    ౨వ పాదం: పదములు పూరింపగోరె ....
    ౩వ పాదం: పదములు గొనుడని రాముడు
    -ఊకదంపుడు

    ReplyDelete
  5. This comment has been removed by the author.

    ReplyDelete
  6. అభినందనలు. బ్లాగులోకంలో పద్యాల ప్రవాహానికి కారణభూతులై భగీరథ సములైన మా గురువుగారేమన్నారో మీరొకమారు చూడాలి.

    ReplyDelete
  7. బ్లాగేశ్వరా,
    మరో చూపు చూడరూ, నా పద్యాన్ని.

    ReplyDelete
  8. బ్లాగేశ్వరా,
    దుమ్ము రేపిందండీ మూడో పాదం. నేను రాస్తూండగానే మీ కామెంట్ వచ్చింది. అయిందనేఅనుకుంటున్నా మరి ఇప్పుడు.

    ReplyDelete
  9. బ్లాగేశ్వర గారు,
    అజ్విశిష్టాక్షరము గురించి ఏమైన తెలిసినదా? నేను నా దగ్గర ఉన్న రెండు 'పిల్ల' వ్యాకరణం పుస్తకాలు చూశాను కాని అందులో ఈ ప్రస్తావన లేదు. ఆచ్చు విశిష్టము గా కల అక్షరము అని చెబుదామంటే, ఇంచుమించు ప్రతిఅక్షరం లోనూ అచ్చు ఉంటుంది. నేను ఈ ప్రశ్నను మర్చిపోలేదు అని చెప్పే ప్రయత్నమే ఇది. ఈ లోపు మీకు తెలిస్తే పంచుకోండి.

    ReplyDelete
  10. మీ పై పద్యం చదువుతుంటే నేను తొమ్మిదో/పదో తరగతిలో తెలుగు వాచకంలో చదువుకున్న "చాటువులు" అనే పాఠంలోని ఈ పద్యభాగం గుర్తోస్తోంది.

    శ్రీనాధుడు రాయలసీమలో కరవుతాండవించుచున్న ప్రాంతంలో ఒకసారి శివుని మీద చెప్పిన చాటు పద్యంగా నాకు చదివ్నట్టు గుర్తు(పద్యం మొత్తం గుర్తు లేదండి).

    ముగింపు మాత్రం యిలా వుంటుంది.

    --------
    ---------
    గంగ విడువుము పార్వతి చాలున్.


    స్మశానంలో బూడిద పూసుకుని తిరిగి అడుక్కుని జీవించే నీకు ఇద్దరు పెళ్ళాలెందుకు పార్వతిని అట్టేపెట్టుకుని గంగను మాత్రం విడిచి పెట్టు
    (నా సొంత కపిత్వం కలిపితే పెద్దలు క్షమించాలి. తప్పులేమైనా ఉంటే[ఊంటే ఏమిటి నాబొంద ఖచ్చితంగా ఉంటాయి] సరిదిద్దగలరు.)

    యిక్కడ శ్రీనాధుడి భావం, స్వామీ మాకు గంగాదేవిని(నీళ్ళని) వదిలిపెట్టమని.

    ReplyDelete
  11. చంద్ర శేఖర్ గారు మీ అంటుటున్న ఈ చాటుపద్యమే కదా

    సిరిగల వానికి చెల్లును

    తరుణుల పదియారు వేల తగబెండ్లాడన్‌.

    తిరిపెమున కిద్దరాండ్రా?

    పరమేశా గంగవిడుము పార్వతి చాలున్‌

    అజ్విశిష్టాక్షరము నేను ఒక ఛందస్సు పుస్తకములొ చూశాను. నాకు దాని వివరణ దొరకలేదు. ప్రస్తుత్తం వత్తిడి ఎక్కువగా ఉండడం వల్ల సమాధానం చెప్పలేకపోయాను.

    ReplyDelete

మీ సందేశం