మా నాన్న గారు ఎందుకురా ఈ పద్యాలతో సమయము వ్యర్థము చేస్తున్నావు....చేయవలసిన పని మానేసి... అన్నారు
అందుకు నాస్పందన
కందములు రాయ వలదన
గాదురదగల కరము నిలకడగ నిలుచునే
ఛందము నేర్చిన వాడిని
బందము చేసిననునతడు పద్యము విడునే
Thursday, 8 November 2007
Subscribe to:
Post Comments (Atom)
రెండవ పాదం లో ప్రాస సరిపోలేదనుకుంటున్నాను. నాలుగు పాదాలలోనూ పూర్ణబిందు ప్రాస యుండాలి. మీరు పైన వాడిన చెల్లుతాయి కాని యతి చెల్లించటానికి పద్యం మార్చాల్సి వస్తుంది.
ReplyDelete- ఊ|| దం||
మీరు పైన వాడిన "అందుకు" ,"స్పందన" చెల్లుతాయి కాని యతి చెల్లించటానికి పద్యం మార్చాల్సి వస్తుంది.
ReplyDelete- ఊ|| దం||
బ్లాగేశ్వరా అందుకోండి దీపావళి
ReplyDeleteటప.టప.ధన్.ధన్.పట.పట తుస్స్
కంగారు పడకండి(శుభాకాంక్షలన్నమాట)
బ్లాగేశ్వరా, ఊదం గారి సూచన మేరకు, ఈ రెండో పాదం పరిశీలించండి:
ReplyDelete"కందను మించు దురదగల కరము నిలుచునే"
ఊదం గారూ, ఓ సందేహం.. ప్రాసాక్షరానికే గదా ఆ నియమం, నాలుగు పాదాల్లోని మొదటక్షరాలు అన్నీ గురువులో, అన్నీ లఘువులో ఉంటే చాలు కదా?
బ్లాగేశ్వరా, మీకనూ దీపావళి శుభాకాంక్షలు..
ReplyDeleteమీ శార్దూలం త్వరలోనే గర్జించాలని నా ఆకాంక్ష
ReplyDeleteచదువరి గారు,
ReplyDeleteకాదనుకుంటా. బిందు పూర్వక యతి పాటించాలి. 'ఇంతింతై వటుడింతై"
'భండన భీముడు' పద్యాలు పరిశీలించండి.
ఇంకోటి ఏమిటంటే, బిందుపూర్వకము,దిత్వమూ ఐతే రెండూ పాటించాలి.
"గుండ్రాయికి కాళ్లు వచ్చి" అని మొదలు పెడితే, ప్రాస స్థానం లొ 'ండ్రా' ఉండాల్సిందే అన్నమాట. ఈ మధ్య మేడసాని వారి అవధానం లో పృఛ్చకులు సమస్య 'బిన్‍లాడన్' అని మొదలు పెడితే అధ్యక్షులవారు దుష్కరప్రాస అన్నారు.
శ్రీ శ్రీ గారు ఇలాంటి ప్రాస పాటించటానికి 'Somehow కందము' రాసితి నన్నారు. ఆ ముచ్చట మరెప్పుడైనా.
నెనరులు, ఊదం గారు. వికీలో కందం పేజీని సవరించాలనుకుంటాను.
ReplyDelete