జీర్ణం జీర్ణం వాతాపి జీర్ణం, ఏనుగు తిన్న వెలగ పండు జీర్ణం, గుఱ్ఱం తిన్న గుగ్గిళ్ళు జీర్ణం, మా పిల్లవాడు తిన్న అన్నం జీర్ణం అని తల్లులు చంటి పిల్లలు అన్నం తిన్నక అంటుంటారు. దీని వెనుక ఒక కథ ఉన్నది.
ఇది పురాణాలొని విషయం, రామాయణంలొ అరణ్యకాండ లొ చెప్పబడింది. శ్రీ రాముడు అరణ్యవాసం చేస్తూ అగస్త్యుడు ఉండే ఆశ్రమం జాడ సుతీష్ణుడు అనే ఋషి వల్ల కనుగొంటాడు. సీతారామ లక్ష్మణులు అగస్త్యుడి ఆశ్రమాన్ని వెదుకు కుంటూ వెళ్తంటే ఒక పెద్ద బూడిద గుట్ట, ఎముకల గుట్ట కనిపిస్తుంది. అప్పుడు రాముడు సీత లక్ష్మణులను చూసి ఆక్కడ పూర్వం జరిగిన వృత్తాంత్తాన్ని చెబుతాడు.
పూర్వ కాలం లొ ఇల్వలుడు వాతాపి అనే ఇద్దరు రాక్షసులు ఉండేవారు. వారిలొ ఇల్వలుడికి మృతసంజీవిని విద్య వచ్చు, వాతాపి కి కామరూప విద్య వచ్చు. వీరు నరమాసం భంజించడం కోసం ఒక ప్రణాళిక వేసుకొనేవారు. వాతాపి కామారూప విద్యతొ మేక గా మారిపోయేవాడు. ఇల్వలుడు మార్గమధ్యం లొ కనిపించే బ్రాహ్మణులను తన తండ్రి శార్ధ కర్మకు భోక్తగా రమ్మని వేడుకొనే వాడు. త్రేతా యుగ ఆచారాల ప్రకారం శార్థంలొ మాంసం పెట్టాలి కాబట్టి మేకగా మారిన వాతాపిని మాంసం కూర చేసి వడ్డించేవాడు. భోజనం అంతా పూర్తి అయ్యేసరికి ఇల్వలుడు తన మృత సంజీవిని విద్య నుపయోగించి వాతాపి పిలిచేవాడు. వాతాపి ఆ బ్రాహ్మణుడి ఉదరాన్ని చీల్చుకొని బయటకు వచ్చేవాడు. అప్పుడు ఇల్వలుడు వాతాపి కలసి ఆ బ్రాహ్మణుడిని భంజించేవారు.
ఇలా ఉండగా ఒకరోజు అగస్త్యుడు ఆ మార్గం లొ వెళ్తుండడం చూసి ఇల్వలుడు తన తండ్రి ఆర్థికం దానికి భోక్తగా రమ్మంటాడు. త్రికాల వేది అయిన అగస్త్యుడు విషయాన్ని పసి గట్టి సరే అని ఒప్పు కొంటాడు. యధాప్రకారం వాతాపి ని మాంసం కూర గా చేసి వడ్డిస్తాడు, అగస్త్యుడి ఉత్తరోపాసన అయ్యాకా ఇల్వలుడూ తన మృతసంజీవిని విద్య ఉపయోగించి వాతాపి రా అంటాడు. అప్పటికే అగస్త్యుడు తన తపోశక్తి నుపయోగించి వాతాపిని జీర్ణం, వాతాపి జీర్ణం అని వాతాపిని పూర్తిగా జీర్ణం చేసేసుకొంటాడు. అప్పుడు ఇల్వలుడి తొ వాతాపి జీర్ణం అయ్యి పోయాడు అని చెప్పగా ఇల్వవుడు కోపంతో క్రూరమైన రాక్షస రూపాన్ని పొంది అగస్త్యుడి మీద వస్తుంటే అగస్త్యుడు ఒక హూంకారం తో అలా మీదకు వస్తున్న ఇల్వలుడిని తపో శక్తితో ఉగ్రం గా చూస్తే ఇల్వలుడు భస్మం అయిపోతాడు.
ఆవిధంగా వాతాపి ని జీర్ణం చేసుకోవడానికి అగస్త్యుడు వాడిన పదాన్ని చంటి పిల్లలు జీర్ణం కావడానికి కష్టం ఉన్న పదార్థం తిన్నప్పుడు పెద్దలు జీర్ణం జీర్ణం వాతాపి జీర్ణం అంటారు. ( వాతాపి లాంటి వాడే జీర్ణం అయ్యి నప్పుడు ఈ పదార్థం జీర్ణం అవ్వడం ఏమంత కష్టం కాదు అని అర్థం)
మీరు వ్రాసిన కధ బావుంది. ప్రస్తుతం మన తెలుగు భాష, సంస్కృతి, నుడికారం, పురాణాలు వదలి వేస్తున్న ఈ తరుణంలో మీరు ఇటువంటి కధాంశాలను ప్రచురించడం ఆనందదాయకం. మీ బ్లాగులో మరిన్ని మంచి పోస్టుల కోసం ఎదురుచూస్తూ ఉంటాను.
ReplyDeletetelugusnehithulu.blogspot.com
'జీర్ణం జీర్ణం వాతపి జీర్ణం' జాతీయం వెనుక కథను చక్కగా చెప్పారు. ఇలాగే మరిన్ని జాతీయాలు- వాటి కథా, కమామీషులు సైతం తెలుపగలరు. Keep the good work going.
ReplyDeleteour children are enlightened through your good work
ReplyDeleteసంతోషం...ఈ కథ అంతకు మునుపే తెలిసినప్పటికి...మరలా మీ బ్లాగు పుణ్యమా అని ఘ్నప్థికి తెచ్చుకున్నాను...ధన్యవాదాలు
ReplyDelete