Monday 3 December 2007

గురువులకు నమస్సులు

కం.
హృద్యముగ శిశు పరీక్షా
విద్యను వైవిధ్య రీతి వివరించితిరే
ఉద్యోగము చూపితిరే
పద్యముతోగురువరేణ్య!ప్రణితములివిగో

5 comments:

  1. కం.అర్థము వివరించమనుచు
    అర్థించెద నేను మిమ్ము పద్యము చూడన్
    అర్థిత పర్థము సరిగా
    అర్థము కాలేదు నాకు అందుకె అడిగా.

    ReplyDelete
  2. కం. విద్యల సఫలత నొందియె,
    ఉద్యోగముపొంది నట్టి ఉన్నత వేళన్
    అధ్యాపకులకు దక్షిణౌ
    పద్యము జెప్పిరి, భళిభళి, బాలల వైద్యా!

    ReplyDelete
  3. ఊకదంపుడుగారూ, గణభంగమైంది. దక్షిణలో క్ష (క్+ష) సంయుక్తాక్షరం కాబట్టి యిది భగణమౌతుంది.

    ReplyDelete
  4. రాఘవ గారు,

    మార్చాను చూడండి.

    కం. విద్యల సఫలత నొందియె,
    ఉద్యోగముపొంది నట్టి ఉన్నత వేళన్
    అధ్యాపకగణ సన్నుతి
    పద్యము జెప్పిరి, భళిభళి, బాలల వైద్యా!

    ధన్యోస్మి.

    -ఊకదంపుడు

    ReplyDelete

మీ సందేశం