Sunday 25 November 2007

నమః శివాయ

ఆ.వె.
పన్నగాభరణుడు ఫాలాక్షునకు విబూ
దలదుకొన్న శివకి నభము వస్త్ర
ముగగలపరిశుద్ధ పూర్ణ స్వరూపికి
వందనము న కార మంత్రరూప

10 comments:

  1. ఆటవెలదిలోన కైలాసపతిగూర్చి
    వ్రాయబూని మీరు బ్లాగులోన
    వుంచినట్టి హరునిపంచాక్షరీస్తోత్ర
    మందు పద్యమెంత బాగయుంది!

    ReplyDelete
  2. This comment has been removed by the author.

    ReplyDelete
  3. విక్రమార్కుడైన విడుచును భేతాళు
    పట్టుసడలి ప్రేతవనమునందు;
    పద్యరీతులనుడుమల్లె పట్టెనిక తా
    వదలబోడు, పద్య’మాట బాబు’

    ReplyDelete
  4. బాగ జెప్పినారు బ్లాగేశ్వరామీరు
    గణములిమడగ సరిగ పదములలొఁ
    ప్రాస యతులు కుదిరె బలె బాగుగానును!
    వ్రాయుదు రిటులేన నాశ నాది.


    శివుని ఆజ్ఞ లేక, చీమైన కుట్టదు
    ఆజ్ఞ తోనె మనకు, ఆటవెలది
    ఎంత జెప్పు కున్న ఈశ్వరుని గురించి
    అంత మిగిలి యుండు, నతని మహిమ

    మీ పుణ్యమా అంటూ నా ఆడవెలది లెక్క ఒకటి నుండి మూడుకు వెళ్లింది :)

    ReplyDelete
  5. @రాఘవ
    ఆ.వె.

    రాఘవా! తమరిటు రావడము తమక
    లముననాటపాలొ రచన వ్యాఖ్య
    చేయడము ముదితుని చేసెన్ శివ కృపను
    న్న మిగిలిన స్తవ రచన సలిపెదను

    @గిరి
    కం.
    గిరి ! వచ్చితి పలుమార్లు త
    మరిబ్లాగుకు శంకరస్తవమాడెడి కడుప
    ద్యరచన కొఱకు కనరా
    క రాయ శివస్తోత్ర మాలికను పూనుకొనెన్

    @రాకేశ్వర
    ఆ.వె.
    నీతొ అనెద నీవు నేర్పిన విద్యయే
    నీరజాక్ష ! అంటితివి జడముగ
    నున్న నాకు పద్యదురదను,వదిలించ
    చూస్తి కాని విడదు జూదము వలె

    ReplyDelete
  6. పరుచు చుండి రండి, పద్య పానుపిచట
    ఉడుపు పైన నుడుపు ఒడుపు గాను
    ముడుపు ఒకటి నేను ముడుతలు విప్పేను
    ఆట విడుపు వంటి యాటవెలది

    ReplyDelete
  7. బ్లాగేశా, ముందుగా మీ తరఫున శివునికో బిల్వం.


    తలపైని కరముంచ తలపోయ డీతడు
    మోహినీరూపంపు మోజు లేదు
    వానియుదరమందు వాసముండనబోడు
    వాసుదేవుడు గాడు వృషభ మూర్తి
    గరళము నిల్పుమా కంఠమందనబోడు
    అమృతమ్ము ద్రావగ ఆశ లేదు
    అమ్మజేరగబోవ అడ్డుగా తారాడు
    అర్ధనారీశుపై నమిత భక్తి

    ఫాలనేత్ర!సాంబ!పన్నగ భూషణ!
    సోమ! స్థాణు! ఆది శంకర! ఈశ్వర!
    భక్తవత్సలా!శుభంకర! మామిత్ర
    కేసరికొసగుమయ కోరు వరము!.


    ఇక :
    పద్య రచన యందు పారాడు శిశువని
    ఎంచి తేను మిమ్ము ఎరుగ లేక
    ఆట వెలది తోడ ఆటలా డగనేడు
    తెలుసు కొంటి తమని దిట్ట కవిగ!

    పద్య కవి మిత్రులారా,
    ఎప్పటిలానే, యధాశక్తి ఛందోవ్యాకరణ దోషాలు తెలుపుడీ.

    ReplyDelete
  8. "ఊకదంపుడు"గారు, సీసముపైని ఆటవెలదిలో రెండోపాదం లయతప్పింది, చూడండి (నాకు యతిదోషాలని యెంచ బుద్ధికాలేదు).

    ReplyDelete
  9. రాఘవ గారు ఊకదంపుడు గారు సవరణలతో సీస పద్యాన్ని సరిచేశారు వారి బ్లాగులొ ఉంచారు http://vookadampudu.wordpress.com/2007/11/19/%e0%b0%b8%e0%b0%bf%e0%b0%97%e0%b1%8d%e0%b0%97%e0%b1%87%e0%b0%b2/#comments

    ReplyDelete
  10. రాఘవ గారు,

    మార్చాను చూడండి.
    సీ. తలపైని కరముంచ తలపోయ డీతడు
    మోహినీరూపంపు మోజు లేదు
    వానియుదరమందు వసియింప మనబోడు
    విష్ణుమూర్తియె గాడు వృషభ మూర్తి
    గరళము నిల్పుమా కంఠమందనబోడు
    అమృతమ్ము ద్రావగ ఆశ లేదు
    అమ్మజేరగబోవ అడ్డుగా తారాడు
    అర్ధనారీశుపై యమిత భక్తి

    ఆ. ఫాలనేత్ర!సాంబ!పన్నగ భూషణ!
    శంభు!సోమ! ష్థాణు! శంకర! శివ!
    భక్తవత్సలా!శుభంకర! మామిత్రు
    కొసగుమా వడిగొని, కోరు వరము.

    యతిదోషాలు కూడా సరిచేశాననే అనుకుంటున్నాను. కనిపిస్తే చెప్పండి. ఎత్తి చూపితే కదా నేర్చుకుంటున్నవారికి, ముందు ముందు నేర్చుకోబోయే వారికి తెలిసేది. ధన్యోస్మి.

    -ఊకదంపుడు

    ReplyDelete

మీ సందేశం