Monday 3 December 2007

మాంచెష్టర్ అనుభవము

రాకేశ్వరుడు బస్సులొ పది రూపాయల నోటు చూసి ఆటవెలది చెప్పినట్లు, నాకు మాంచెష్టరు నగరములొ దిగిన వేంటనే కందము చెప్పవలెనన్న దురద పుట్టింది. గిరి గారు మీరు చెప్పినట్లు ఈ పద్యము సుమారుగా పేపరు పెన్ను లేకుండా మనసులొ కూర్చాను.ఈ క్రింది గడ్డ పది పదిహేను నిమిషాలలొ తెగింది. యధావిధముగా ఛందో దోషము, అక్షర దోషము , వ్యాకరణ దోషము తెలుపుము.

కం.
మాంచెష్టరునగరమ్మున
మంచుయు వర్షము కురియని మంచి దినంబున్
కాంచెదమనెడిన్ నొకపరి
వాంఛయునెప్పటికితీరు బ్లాగేశ్వరుకున్

6 comments:

  1. హహ్హ. సూపరు. మూడో పాదానికి కొంచెం మెరుగుపెట్టి వుండాల్సింది.

    ReplyDelete
  2. కం. కవనము కలరహితముగా
    వ్యవహారపు భాషలోన హాయిగ వున్నా
    సవరణ మూడవ పాదము
    కవసరమని నేను కూడ అనుకుంటున్నా :)

    ReplyDelete
  3. కం.
    సమయమునకేదొనొకప
    ద్యముత ట్టెమనంబునందు అట్లొచ్చినప
    ద్యమురామరాఘవులు శు
    భ్రముచేయమనగ,మదినతలపురావట్లే

    ReplyDelete
  4. శ్రీ బ్లాగేశ్వరులవారికి వందనములు. అయ్యా, కొన్ని దినముల క్రిందట భవదీయుడు తమ కొక వేగును పంపియున్నాడు. తమనుండి ప్రత్యుత్తరము లేనందున అది తమకందినట్లు లేదని భావించుచున్నాడు. తమరి చిరునామా తప్పగా వ్రాసియుండెడి సంభావ్యక తూడా కలదు. యేమయిననూ దయచేసి తమరొక వుత్తరమును పంపగలరని ఆశించుచున్నాడు. :)

    ReplyDelete

మీ సందేశం