నేను టపా వేసి చాలా రోజులు అయ్యింది.వ్రాయడానికి సృజనాత్మక ఆలోచనలు ఏమి లేవు. చిన్నప్పటి నుండి పద్యాలు వ్రాయాలి వ్రాయాలి అనే కుతూహలం చాలా ఎక్కువగా ఉండేది. కాని వ్రాసే పటిమ లేకపోయింది. అంతర్జాలం లొ తెలుగు ప్రపంచం చూశాక మళ్ళి పద్యాలు వ్రాయాలి అనే ఆలోచన వచ్చింది. వృత్తాలు వ్రాయాలి అని ప్రయత్నించాను కాలేదు. కాని
నోటువెలది చూసి చూసి చదువరుల
గురులఘువులున్ చదివి చదివి తెలు
గున నేను మెదటి ఆటవెలది రాయు రాయు
నాటపా జనంభు కాంచు కాంచు
Thursday, 20 September 2007
Subscribe to:
Post Comments (Atom)
మాటలబాబు గారూ, మంచి ప్రయత్నం. నెమ్మదిగా వృత్తాలని చేరుకోచ్చు.
ReplyDeleteఇంతకీ ఈ "జనంభు" ఏమిటండీ?
మొదటి అడుగు బానే వేసారు. నేనూ ఆటవెలదితోటే మొదలుపెట్టాను. చూసారుగా ఇంకా గణాల లెక్క తేలలేదు.:) సుజనరంజని వారి సమస్యా పూరణ కూడా చూడండి.
ReplyDeleteపద్యాలకొక విభాగం పెట్టమని వీవెన్ను అడగాలనుకుంటా. ;)
@శ్రీరామ్ గారు జనంభు అని వ్రాశాను జనంబు అని వ్రాస్తే సరిపోతుందేమో. రాకేశ్ గారు సూచించినట్లు తరువాత తేటగీతి ప్రయత్నిస్తాను
ReplyDelete@చదువరి గారి వ్యాఖ్యకు ధన్యవాదాలు.బ్లాగులతో పాటు పద్యాల వ్యాప్తి కుడా చేయాలి
శ్రీరాం గారు ఓకే చేసినట్లునారు అయితే మరి పండితులయినట్లే. అభినందనలు.
ReplyDeleteమాటల బాబు గారు,
ReplyDeleteమీరు కూడా పద్యాలు వ్రాయుట మొదలు పెట్టడం బహు సంతోషకరము.
ఇంకేముంది, మా కొత్తపాళీ పద్యాల స్కూలులో చేరండి.
నన్ను రానారె అక్కడ చేర్పించారు,
మిమ్మల్ని నేను refer చేస్తాను. :)
కానీ గురువుగారు మొదటి పద్యానికెప్పుడూ వాత పెడతారు జాగ్రత్త.
http://andam.blogspot.com/2007/06/blog-post_14.html