Monday, 3 December 2007

మాంచెష్టర్ అనుభవము

రాకేశ్వరుడు బస్సులొ పది రూపాయల నోటు చూసి ఆటవెలది చెప్పినట్లు, నాకు మాంచెష్టరు నగరములొ దిగిన వేంటనే కందము చెప్పవలెనన్న దురద పుట్టింది. గిరి గారు మీరు చెప్పినట్లు ఈ పద్యము సుమారుగా పేపరు పెన్ను లేకుండా మనసులొ కూర్చాను.ఈ క్రింది గడ్డ పది పదిహేను నిమిషాలలొ తెగింది. యధావిధముగా ఛందో దోషము, అక్షర దోషము , వ్యాకరణ దోషము తెలుపుము.

కం.
మాంచెష్టరునగరమ్మున
మంచుయు వర్షము కురియని మంచి దినంబున్
కాంచెదమనెడిన్ నొకపరి
వాంఛయునెప్పటికితీరు బ్లాగేశ్వరుకున్

గురువులకు నమస్సులు

కం.
హృద్యముగ శిశు పరీక్షా
విద్యను వైవిధ్య రీతి వివరించితిరే
ఉద్యోగము చూపితిరే
పద్యముతోగురువరేణ్య!ప్రణితములివిగో

Sunday, 2 December 2007

నమః శివాయ

ఆ.వె.
గంగ జలము చేత గంధము మందార
మున్నగు బహు పుష్పములతొ పూజ
లందు కొనెడి నంది ప్రమథనాధేశ్వర
వందనము మ కార మంత్ర రూప

Sunday, 25 November 2007

నమః శివాయ

ఆ.వె.
పన్నగాభరణుడు ఫాలాక్షునకు విబూ
దలదుకొన్న శివకి నభము వస్త్ర
ముగగలపరిశుద్ధ పూర్ణ స్వరూపికి
వందనము న కార మంత్రరూప

Friday, 23 November 2007

రాట-టు-యి

నిన్న రాట-టు-యి సినిమా చూద్దామని అనుకొన్నాను కాని చూడడడం కుదరలేదు.

ఆ.వె.
వలదననినను సినిమాకెళ్ళ చూస్తిని
చూస్తి దగ్గరగల చిత్ర గృహము
గృహము కెళ్ళుటకును కాస్తిని బస్సును
బస్సు రాక పోవ పూన్కి విడెను